యాదాద్రి భువనగిరి జిల్లా: ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా శుక్రవారం మూసీ నది ఉప్పొంగింది. బుధన్ పోచంపల్లి మండలంలోని జూలూరు రుద్రవెల్లి గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బ్రిడ్జి వద్ద భారీ కేట్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మూసి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపరులు నది వైపు వెళ్ళవద్దని హెచ్చరికలను జారీ చేశారు.