Araku Valley, Alluri Sitharama Raju | Aug 28, 2025
డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ని అరకులోయ సీఐ హిమగిరి గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఉంచాలని ఎస్ఐ పాపినాయుడికి సూచించారు మండల పరిధిలో ఎంతమంది రైతులకు ప్రత్యామ్నాయ పంటల ద్వారా మొక్కలను అందజేసిన ది వివరాలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ఐ పాపినాయుడికి సీఐ హిమగిరి సూచించారు