అనంతపురం నగర శివారులోని చిన్మయ నగర్ లో పోగైన చెత్తను కాలుస్తుండగా అందులోకి హిట్ ఖాళీ బాటిల్ విరిసిన నేపథ్యంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. చెత్తను కాల్చక్రమంలో ఖాళీగా ఉన్న సీసాలను విసరడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో చిన్మయి నగర్ కు చెందిన నారాయణరెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.