భారత స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ వర్ధంతి సందర్భంగా శనివారం ఆమె చిత్రపటానికి డోన్ సామాజిక కార్య కర్త పి.మహమ్మద్ రఫి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1899 మార్చి 6న జన్మించారన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అనంతరం ఆమె సేవలు కొనియాడారు.