భోగాపురం లో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణపు పనులను కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. శనివారం ఉదయం ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడుతో కలిసి పరిశీలించిన ఆయన పనులు ఏ మేరకు జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఆయనతో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.