చిట్వేల్ మండలంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లను రైల్వేకోడూరు గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. చిట్వేల్ మండలం చెర్లోపల్లె పంచాయతీ సమీపం లోని ఎల్లంరాజు చెరువులో నిమజ్జనం చేయడానికి గల అనుకూలమైన పరిస్థితులను ఆయన పరిశీలించారు. నిమజ్జనం చేయడానికి చెరువు వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు చేయాలని చిట్వేల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ కు ఆయన సూచించారు. ఆయన వెంట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.