కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, దీంతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. కుప్పం, గుడిపల్లి మండలాల పరిధిలో పలుచోట్ల టీడీపీ నేతలతో కలిసి ఆయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి? గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆయన ఆరా తీశారు.