యూరియా కొరతపై కూటమి చర్యలు శూన్యమని జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు. సోమవారం నరసన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతుల సమస్యల పరిష్కరించకపోతే పోరాటం తప్పదని ఆయన డిమాండ్ చేశారు. యూరియా, డీఏపీ వంటి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు యథేచ్చగా తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.