తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కోళ్ల మిట్ట షాప్ నంబర్ (30) లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఏటీఎం సైజులో ఉండే ఈ కార్డులో క్యూఆర్ కోడ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇంటి యజమాని ఫోటో మాత్రమే ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా రూపొందించిన వీటిని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కిరణ్మయి, తహసిల్దార్ గోపినాధ్, మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు.