Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి మండలం మొరంపల్లి గ్రామ శివారులోని మొరంచపల్లి వాగు వరద నీటితో ఉదృతంగా ప్రవహిస్తోంది. కాగా, ఈరోజు గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లడంతో నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.