అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటినుంచే కొనసాగించాలని జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. జిల్లాకేంద్రాన్ని తరలించే యత్నాలను తీవ్రంగా ఖండించింది.రాయచోటి మౌలిక వసతులు, కలెక్టరేట్–ఎస్పీ కార్యాలయాలు సహా 98 శాఖల కార్యాలయాలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని వక్తలు గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం మార్పు ఆలోచన జరుగుతోందని మండిపడ్డారు.ఎన్నికల హామీ ప్రకారం రాయచోటినే జిల్లాకేంద్రంగా కొనసాగించాలని సీఎం చంద్రబాబును కోరుతూ, అవసరమైతే ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు.