ముమ్మిడివరం మండలం కొమరగిరిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడుని స్థానికులు శ్రీనిధి ఆసుపత్రికి తరలించారు. గుర్తించిన వారు ఎవరైనా అమలాపురం శ్రీనిధి ఆసుపత్రికి రావాలని సిబ్బంది తెలియజేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.