అంగన్వాడీ కార్మికులకు ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని వేతనాలు పెంచాలని కోరుతూ ఏఐటియుసి సిఐటియు నాయకులు చిత్తూరు తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు తాసిల్దార్ కార్యాలయం ముందు గురువారం నల్ల చీరలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ప్రభావతులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని అన్నారు.