అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన ప్రశాంతి అనే వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 28వ తేదీన చున్నీకి నిప్పంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి తీవ్ర గాయాల పాలైన ఆమెను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.