బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లోనే ఇందిరా పార్కు వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీసీలను కోరారు.