అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం సంజీవపురం బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వంట మాస్టర్ దేవయ్య ను శనివారం పాము కాటేసిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. సిబ్బంది అతనిని హుటాహుటిన రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు అక్కడ చికిత్స పొందుతున్నారు. వంట చేయడానికి వంట పాత్రలు సర్దుతుండగా ఉన్నట్లుండి పాము కాటేసిందని బాధితుడు తెలిపారు.