'గణేశ్ నిమజ్జనంలో సమయమనం పాటించాలి' శ్రీకాళహస్తి మండలం చుక్కల నిడిగల్లు గ్రామంలో వినాయక చవితి పురస్కరించుకొని ఆదివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్, రూరల్ ఇన్ఛార్జి సీఐ గోపి, టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి పూజలు చేశారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి వినాయక నిమజ్జనం కార్యక్రమానికి ఆహ్వానించడం పట్ల పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు. సంయమనం పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు.