నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో ముందస్తు భద్రత చర్యలో భాగంగా ప్రజలు సురక్షితంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఉద్దేశంతో పట్టణంలోని ప్రార్థన మందిరాలు వినాయక మండపాలు ప్రధాన చౌరస్తా లలో శుక్రవారం మూడు గంటల సమయంలో బాంబు బాంబుస్కార్డ్ పోలీస్ బృందం తనిఖీలు నిర్వహించారని ఎస్పీ యోగేష్ గౌతం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.