జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 9వ వార్డులో 1 కోటి 25 లక్షల రూ. వ్యయంతో చేపట్టిన సిసి రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...జగిత్యాల పట్టణంలో మౌలిక వసతులు కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు.1 కోటి 50 లక్షల తో రామాలయం నుండి కెనాల్ వరకు రోడ్డు పురుద్ధరణ చేయటం జరిగింది.ధరూర్ క్యాంప్ లో నూతనంగా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ సెంటర్, ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన....