మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల లో ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ కేంద్రాలను శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అల్లాదుర్గం మండల విద్యాశాఖ అధికారి ధనుంజయ అల్లాదుర్గం ఎస్సై ప్రవీణ్ రెడ్డిలు పరిశీలించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల బూతుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జెడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గదులను పరిశీలించారు.