నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి సోమవారం ఒక పూరి గుడిసె దగ్ధమైంది. పద్మ అనే మహిళ వంట చేస్తుండగా నిప్పు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.