ప్రధానమంత్రి కుసుం కార్యక్రమ అమలుకు చర్యలను వేగవంతం చేయాలని జిల్లాలో చిన్న తరహా నీటిపారుదల ట్యాంకులను నింపడంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.గురువారం సాయంత్రం అమరావతిలోని సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్..... ప్రధానమంత్రి కుసుం, చిన్న తరహా నీటిపారుదల ట్యాంకుల నిర్వహణ, భూగర్భ జలాల పెంపుదల, వికలాంగ పింఛన్లు, బాలల సంరక్షణ సంస్థల ఏర్పాట్లు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.