కర్నాటక రాష్ట్రంలోని తిమ్మలాపురం గ్రామ సమీపంలో హెచ్చెల్పీ కాలువలో గల్లంతైన ఓ యువకుడు బొమ్మనహాశ్ మండలం దేవగిరి క్రాస్ వద్ద శవమై తేలాడు. బంధవులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పవన్(22) ఈనెల 19 న లారీ డ్రైవర్ గా వెళ్లాడు. తిమ్మలాపురం వద్ద హెచ్చెల్సీ కాలువలో ఈత కోసం వెళ్లి గల్లంతయ్యాడు. శుక్రవారం సాయంత్రం దేవగిరిక్రాస్ వద్ద పిల్ల కాలువలో శవమై కనిపించాడు. స్థానికలు బొమ్మనహాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు ఆరా తీయగా కుడితిని పోలీసుస్టేషన్ లో ఆ యువకుడి మిసింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు.