ఏలూరులో మినీ బైపాస్ రహదారిలో కారు అదుపుతప్పి ఆగి ఉన్న ఆటోను, లారీని ఢీకొంది. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వట్లూరు వైపు నుంచి మినీ బైపాస్ రహదారిలో ఏలూరు వస్తుండగా టైరు పంచర్ కావడంతో అదుపుతప్పింది. రహదారి పక్కన ఉన్న ఆటోని ఢీకొని తర్వాత లారీ వెనుక ఢీకొని కొద్ది దూరంలో ఆగింది. కారు ముందు భాగం ధ్వంసం అయింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.