ఈనెల 15 ఆదివారం డోర్నకల్ మండలం రావిగూడెంలోని బంధువుల ఇంట్లో జరిగే కార్యక్రమానికి మహబూబాబాద్ పట్టణం రామచంద్రపురం నుండి వచ్చిన ఉల్లి రాకేష్ అదృశ్యమయ్యాడు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, డోర్నకల్ సీఐ రాజేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి యువకుడి కోసం గాలించగా ,ఈరోజు ములకలపల్లి శివారు పాండవుల గుట్ట మీద మృతుడు రాకేష్ డెడ్ బాడీ ని కనుగొన్నారు. డెడ్ బాడీ ముఖంపై తీవ్ర గాయాలు ఉండడంతో ఎవరో గుర్తు లేని వ్యక్తులు హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.