అనంతపురం రూరల్ మండల పరిధిలోని కృష్ణం రెడ్డి పల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో తండ్రి కుమార్తెకు గాయాలైన సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గాయపడిన వారిద్దరిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.