నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం 12 గంటల సమయంలో ఏబివీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచాలని కోరారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. లేనిచో విద్యార్థులు మధ్యలో విద్యను మానుకోవాల్సి వస్తుందని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు.