ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారం అగ్రహారం సర్పంచ్ రాజేశ్వరి తనను తన మరిది మేకల రమణయ్య కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపించింది. అంతేకాకుండా సర్పంచ్ గా తాను గెలిచిన పెత్తనం మొత్తం మరిది రమణయ్య నే చేస్తున్నాడని సర్పంచ్ వాపోయింది. తనపై జరిగిన దాడి విషయాన్ని బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ లో రాజేశ్వరి ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణలో నిజ నిజాలు తెలియవలసి ఉందని ఎస్సై రవీంద్రారెడ్డి అన్నారు. విషయాన్ని మీడియాకు ఎస్ఐ రవీంద్రారెడ్డి సోమవారం రాత్రి 10 గంటలకు తెలిపారు.