సైక్లింగ్‌తో ఆరోగ్యమే మహాభాగ్యం – అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు.ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం “సండేస్ ఆన్ సైకిల్” కార్యక్రమాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని చారిత్రక కొండారెడ్డి బురుజు వద్ద అదనపు ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–“ప్రతి ఆదివారం సైక్లింగ్ చేయడం ద్వారా పోలీసులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వ్యాయామం వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబానికి కూడా మేలు చేస్తుంది” అని అన్నారు.వ