రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 9న చేపట్టనున్న రైతు పోరును జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరారు. బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆదివారం పోస్టర్లను విడుదల చేశారు. రైతులకు యూరియా, అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుపోరుకు రైతులు హాజరై జయప్రదం చేయాలని కోరారు.