రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వర్చువల్ గా రాష్ట్రవ్యాప్తంగా 34 జిజిహెచ్ లలో క్యాన్సర్ డే కేర్ సేవలను ఆయన ప్రారంభించారు. వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య కూడా పాల్గొన్నారు.