పాత గాజువాక జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 20 నిమిషాలుగా ట్రాఫిక్ స్తంభించడంతో అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలలేకపోయాయి. దీనివల్ల అత్యవసర సేవలకు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.