Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 25, 2025
దుద్దలూరు మండల కేంద్రంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని.లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు న్యాయమైన, పాదదర్శకమైన విధానంలో సంక్షేమ పథకాలు చెరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి అర్హుడికి సదుపాయం అందాల క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి,వివిధ శాఖల అధికారులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు