గుంటూరు నగర శివారు ప్రాంతమైన నల్లపాడు రైల్వే స్టేషన్ రైల్వే పట్టాలపై శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమయింది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు ఎవరు, ఎలా మరణించాడు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన యువకుడు తరపున బంధువులు ఉంటే 9966851232 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.