కొరిశపాడు మండలం గుడిపాడు జాతీయ రహదారి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నుంచి మార్టూరు కు టమాటా లోడ్ తో వెళ్తున్న బొలోరో వాహనం డ్రైవర్ నిద్రమత్తుతో అదుపుతప్పి మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం బోల్తా పడింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.