శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలంలోని యాకాల చెరువు పల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం లో వైసీపీ వారిపై టిడిపి వారు దాడి చేసి గాయపరిచారని వైఎస్ఆర్సిపి నాయకులు శనివారం ఆరోపించారు. ఈ సందర్భంగా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ వారిని పలువురు వైఎస్సార్సీపి నాయకులు పరామర్శించి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి వారిని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని, పోలీసులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.