కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చింతకొమ్మదీన్నే సిఐగా గురువారం నాగభూషణం బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ పని చేస్తున్న సిఐను బదిలీ చేయడంతో నూతన సిఐ నియామకమయ్యారు. అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ను చింతకొమ్మదిన్నె నూతన సిఐ నాగభూషణం కలిశారు.స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచుతామని ఈ సందర్బంగా సిఐ నాగభూషణం తెలిపారు.