నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా చూడాలి : జిల్లా ఎస్పీ కృష్ణ జిల్లా ఎస్పీ గంగాధరరావు గురువారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక పెడనలోని గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గత సంవత్సరం జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తరువాత వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమై నిమర్జనం కార్యక్రమాలను శాంతియుతంగా జరిగేలా కమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలన్నారు.