ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బొందలపాడు గ్రామంలో వాగు పోరంబోకు భూమిని ఇతరుల ఆక్రమించుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎమ్మార్వో చిరంజీవి సంబంధిత భూమిని సర్వే చేయించారు. సుమారు 91.49 సెంట్లు వాగు పోరంబోకు భూమిని స్వాధీనం చేసుకొని బోర్డు ఏర్పాటు చేయించినట్లు ఎమ్మార్వో చిరంజీవి తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.