నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలోని నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల అడవిలో గల శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతంలో వజ్రాల అన్వేషణకు ఆదివారం ప్రజలు వందల సంఖ్యలో తరలివస్తున్నారు. గత కోన్ని రోజుల క్రితం వర్షాలు కురవడంతో ప్రకాశం,కృష్ణ, గుంటూరు, నంద్యాల తదితర జిల్లాలకు చెందిన ప్రజలు తరలివచ్చి వజ్రాలను అన్వేషిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు.