Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారులకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రజల సమస్యలతో కూడిన వినతి పత్రం అందించినట్లు తెలిపారు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో మిషన్ భగీరథ నీరు కలుషితం అవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, కాలనీలో సైడ్ డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో చెత్త పేరుకుపోయిందని,వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశం ఉన్నందున దోమల మందు పిచికారీ చేసి సైడ్ డ్రైనేజీలు శుభ్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.