ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల శ్రీశైలం రహదారిలోని పెద్ద మూలమలుపు వద్ద గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుతపులి దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దబొమ్మలాపురానికి చెందిన ఆవుల లాలయ్య పెట్రోల్ బంకులో విధులు నిర్వహించేందుకు వెళుతున్న క్రమంలో రహదారి దాటుతున్న చిరుత పులి ఒకసారి వాహనంపై దూకి చెట్లల్లోకి వెళ్ళిపోయినట్లుగా లాలయ్య తెలిపారు. ఆ సమయంలో కింద పడ్డ తనకు గాయాలయ్యాయి అన్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేసినట్లు తెలిపారు.