షామీర్పేట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికార సిబ్బందితో కలిసి పరిశీలించారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు గత ఏర్పాట్లలో కలిగిన ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో ఏర్పాటు భారీగా జరుగుతున్నట్టు తూముకుంట కమిషనర్, షామీర్పేట ఎమ్మార్వో తెలిపారు. నిమజ్జనం వేడుకలను తిలకించే ప్రజలకు పలు సూచనలు చేశారు.