విజయనగరం జిల్లాలో వివిధ ఇంజనీరింగు, మెడికల్, పాలిటెక్నిక్ మరియు ఇతర కళాశాలలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కళాశాలల్లో ర్యాగింగు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాని జిల్లా SP వకుల్ జిందల్ పోలీసు అధికారులను బుధవారం 3pm ఆదేశించారు.జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ ర్యాగింగు వలన కలిగే దుష్ప్ర్పభావాలను విద్యార్థులకు వివరించి, అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ పరిధిలోగల ఇంజనీరింగు, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలను, ఇతర విద్యాలయాలను సందర్శించి, విద్యార్థులకు ర్యాగింగు దుష్పభ్రావాలను వివరించాలన్నారు.