నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆదివారం కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలయ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. 1969 లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా తొలగించిన త్యాగశీలి స్వతంత్ర పోరాటం నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన వ్యక్తి అని అన్నారు.