నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో హల్చల్ చేసిన మహిళపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. నిమజ్జనం సందర్బంగా నిజామాబాద్ కు చెందిన నసీం బేగం అనే మహిళ బురఖా ధరించి హల్చల్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. సదరు మహిళపై పట్టణ సీఐ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు ఎవరైనా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.