సిర్పూర్ యూ మండలంలో NREGS పనుల్లో రూ.లక్షల్లో అవినీతి జరిగిందని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అవినీతి జరిగిన లక్షల రూపాలను రికవరీ చేయడంలో DRDA అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. చేసిన అవినీతిపై విచారణా జరపకుండా ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసం మని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన సిబ్బంది నుంచి డబ్బులు రికవరి చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.