ఖాజీపేటలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనపై పెట్రోల్ బంక్ యాజమాన్యం స్పందించింది. టెక్నికల్ సమస్య కారణంగానే లీటరు తక్కువ పెట్రోల్ వచ్చినట్లు, గతంలో ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదని స్పష్టంచేశారు.పెట్రోలింగ్ అధికారుల సమక్షంలో సమస్యను పరిష్కరించి, మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చామని వినియోగదారులకు తెలియజేశారు. అదేవిధంగా నిర్ణీత కొలతలతో క్యాలిబ్రేషన్ జరపగా, ఎటువంటి సమస్య లేదని అధికారులు నిర్ధారించారు.