శ్రీకాకుళం నియోజకవర్గం, గార మండలం అంపోలు గ్రామంలో కొల్లి అప్పారావు లలిత దంపతులు ఆర్ధిక పరిస్థితుల కారణంగా, ఆత్మహత్య చేసుకొన్నారని, వారి కుమార్తెకు ఆదివారం రిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. అలాగే అప్పారావు లలిత దంపతుల కుమార్తెకు జీవిత బరోషా కల్పిస్తామని, తక్షణ సాయం కింద కుమార్తెకు,జిల్లా కలెక్టర్ రెండు లక్షల రూపాయలను ప్రకటించారని, ప్రభుత్వ పరంగా నేను కూడా అండగా ఉంటానన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో అసత్య ప్రచారాలకు పాల్పడితే సహించేదిలేదని, కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని, ఎమ్మెల్యే అనంతరం బాలికతో మాటాడారు.