పెంచికల్పేట్ మండలంలోని ఎల్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జగదీష్ సులోచనల మూడవ కుమారుడు నవదీప్ మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేయడంతో వెంటనే కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుని పరిస్థితి విషమించడంతో మంచిర్యాల తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బాలుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి,